Header Banner

హోలీ రోజు బ్యాంకులకు సెలవు ఉందా.. ఈ వారం 4 రోజులు బ్యాంకులు బంద్.!

  Thu Mar 13, 2025 10:07        Employment

దేశంలో ఈరోజు, రేపు (మార్చి 14న) హోలీ పండుగ సందర్భంగా పలు చోట్ల బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే ఈరోజు ఏ ప్రాంతాల్లో హాలుడే ఉంది. ఎక్కడ పనిచేస్తాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో సెలవులు ఉండగా, మరికొన్ని చోట్ల మాత్రం బ్యాంకులు పనిచేస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇచ్చిన సెలవుల షెడ్యూల్ ప్రకారం మార్చి 13న గురువారం హోలిక దహన్ పండుగ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో బ్యాంకులకు హేలిడే ఉంది. ఈ పండుగ కారణంగా ప్రధానంగా డెహ్రడూన్, కాన్పూర్, లక్నో, రాంచీ, తిరువనంతపురం ప్రాంతాల్లో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. మార్చి 14న శుక్రవారం హోలీ పండుగ సందర్భంగా అనేక రాష్ట్రాలలో బ్యాంకులు బంద్ ఉంటాయి.

 

ఇది కూడా చదవండి: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. భారీ అల్పపీడనం.! సుడిగాలులు వస్తున్నాయ్!

 

ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, బీహార్, జార్ఖండ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హైదరాబాద్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ), జమ్మూ, మహారాష్ట్ర, మేఘాలయ, న్యూఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం, శ్రీనగర్, పశ్చిమ బెంగాల్ వంటి ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. కానీ ఇదే సమయంలో చెన్నై, అగర్తలా,బెంగళూరు, భువనేశ్వర్, ఇంపాల్, కొచ్చి, కోహిమా, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో మాత్రం నో హాలుడే. మార్చి 15న ముఖ్యంగా మణిపూర్ సహా పలు రాష్ట్రాల్లో జరుపుకునే పండుగ అయిన యావోషాంగ్ కారణంగా ఈ ప్రాంతాలలో బ్యాంకులు మూసివేయబడతాయి. ఈ పండుగ హిందూ, మైటేయి సంప్రదాయాలతో కలిపి జరుపుకుంటారు. దీంతో అగర్తలా, భువనేశ్వర్, ఇంపాల్, పానాజీ, రాంచీ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. ఇక మార్చి 16 ఆదివారం అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకులకు వారాంతపు సెలవు. ఈ సెలవుల నేపథ్యంలో బ్యాంకులు భౌతికంగా బంద్ ఉన్నా కూడా, ఆన్‌లైన్ బ్యాంకింగ్ , మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి తదితర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు పనిచేస్తాయి. ఈ క్రమంలో వినియోగదారులు తమ ఆన్‌లైన్ సేవలను సురక్షితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు కస్టమర్లు ATMలలో నగదు డిపాజిట్, స్వీకరణ సేవలను కూడా ఉపయోగించుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి: ఏపీకి కేంద్రం అదిరిపోయే శుభవార్త.. 3 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు - అక్కడే.! ఆ ప్రాంతాలకు మహర్దశ

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!

 

నేడు (13/3) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో "ప్రజా వేదిక" కార్యక్రమం! పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్!

 

తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!

 

వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #bank #Moneyandgold #Thief #Karnataka